భారతావని నలుచెదురులా నెలవై ఉన్న ఏన్నో
కళా గోపురాలు మన భారతీయ సంస్కృతికి, సాంప్రదాయాలకీ నిలువుటద్దంలా
నిలుస్తాయి. శతాబ్ధాల క్రితం నిర్మించిన ఎన్నో కట్టడాలునాటి వైభవాలకి స్మ
ృతి చిహ్నాలుగా నిలుస్తూ... వారసత్వ సంపదగా నిలబడి...
నయనానందకరం చేస్తూనే కోట్లాది విదేశీ మారక ద్రవ్యాన్ని అందించడంలో ముందుంటున్నాయి. భారతీయతని తన శిల్పకళా సౌందర్యంతో చాటి చెప్తున్న వాటిలో మహాబలిపురం ఒకటి.
మహాబలి పురం పేరు వినగానే మన తెలుగు గడ్డని పాలించి, తమ పౌరుషాగ్ని చూపిన పల్లవ రాజులు కళ్ల ముందు కదలాడుతుంటారు. వీరు ఈ దేశంలో కొంత భూభాగాన్ని పరిపాలిస్తున్న ఏడవ శతాబ్ధంలో ఎందరో కళాకారులను ఆదుకుని.. తమలోని కళా తృష్ణకు నిలువుటద్దంలా నిలిచేలా.. భరత జాతి తర తరాలు తమ ఖ్యాతిని చెప్పుకునేలా...తమ పేరు చిర స్ధాయిగా జగత్‌లో సువర్ణ అక్షరాలతో నిలచి పోయే లా ఎన్నో శిల్పకళా సంపదని రూపొందించారు.
మన రాష్ట్రంలో కళా వైభవ చిహ్నాలుగా నిలిచే ఎన్నో గోపురాలు శిధిలావస్ధకు చేరి నేలకొరుగుతున్నా పట్టిం చుకోని మనం... కాతీయ రాజులు నిర్మించిన వేయిస్ధం భాల గుడిని కూలగొట్టుకుని జాతి సంపదని, చరిత్ర మిగిల్చిన గొప్పదనాన్ని చెల్లా చెదురుచేసుకోగా.. తమిళ నాట ఉన్న మహాబలిపురం మాత్రం నేటికీ చెక్కు చెదర కుండా పర్యాటకుల్ని ఆకర్షిస్తూ...భారత గత వైభవా లను చాటి చెపుతూనే ఉంది.
ఈ కళాధామం ఎలా పుట్టిందంటే...
మహాబలిపురానికి దగ్గర్లోనే పల్లవ రాజుల సామ్రాజ్యం ఉండేది. క్రీస్తు శకం ఒకటో శతాబ్ధ కాలంలో పూంపు హార్ రాజధానిగా చేసుకుని ఈ ప్రాంతాన్ని పరిపాలిం చిన పల్లవ రాజు ఒకటవ నరరసింహ వర్మ తన సామ్రాజ్యంలోని సముద్ర తీర ప్రాంతంలో పూర్తిగా ద్రవిడ సాంప్రదాయాతో ఇసుకతో ఓ పెద్ద ఆలయాన్ని నిర్మించాడు. అత్యంత సున్నితంగా జరిగిన ఈ నిర్మాణం అత్యంత మనోహరంగా రూపొందించారు నాటి శిల్పులు. ఇప్పటికీ ఈ కళా సంపద యాత్రీ కులకు కనువిందు చేస్తోంది.
ఈ క్రమంలో విష్ణుభక్తుడైన ఆయన వైష్ణవ ఆలయాన్ని ఈ ప్రాంతంలో నిర్మించగా... తరువాత ఈ రాజ్య పాలన చేసిన రెండవ నరసింహ వర్మ మరో రెండు శివుని ఆలయాలని నిర్మిం చి తన రాజ్యంలో శివ కేశవులు ఒక్కరేనని చాటి చెప్పాడు. పూర్తి స్ధాయి శిల్ప కళా సంపదకు నెలవైన ఈ ఆలయాలలో శివ కేశవులు సతీ సమేతులై కొలువు దీరటం ఓ విశేషం.
పల్లవ సామ్రాజ్యానికి అనుకుని ఉన్న ప్రాంతాన్ని మహాబలుడు అనే రాజు పరిపాలిస్తున్న రోజుల్లో దీనికి మహాబలిపురం అని పేరుండేది. అయితే పల్లవ రాజుల్లో ఒకడైన మమల్ల పల్లవ దీనిపై దండె త్తి... తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు. దీన్ని సుందర నగరంగా రూపుదిద్దాలని భావించిన మమల్ల శిల్పకళా సౌందర్యంతో రూపకల్పన చేసి నిర్మాణ పనులు ప్రారం భించి అనేక గోపురాలు, మండపాలు, ఆలయాలు నిర్మించాడు. దీంతో దీనిని మమల్లపురంగా పిలవడం ప్రారంభించారు. అయితే మమల్ల అనంతరం ఈ రాజ్యా న్ని పాలించిన పల్లవ రాజులు సైతం తమ వారసత్వ సంపదని కాపాడుకుంటునే మరిన్ని శిల్పాలను నెలకొల్పేందుకు యత్నించారు.
అయితే కాల క్రమంలో ఆ రాజ్యాన్ని పరిపాలించిన మహాబలుడు పేరుతోనే మహా బలిపురంగా చరిత్రలో నిలచిపోయింది.ఈ మహాబలిపురం నిర్మాణమంతా పల్లవ రాజుల కాలంలోనే పూర్తయ్యిందనే చెప్పాలి. కొండ గుహలని తొలచి..మలచిన శిల్పాలు అచ్చెరు వొందిస్తాయి.
ఆకట్టుకునే పాండవుల రధాలు...
మహాబలిపురం వెళ్లింది మొదలు అడుగడుగునా శిల్ప కళా సౌందర్యాన్ని చూసేందుకు మన రెండు కళ్లు చాల వంటే అతిశయోక్తి కాదు. మహాబలిపురం బస్టాండ్‌కు సుమారు కిలోమీటర్ దూరంలో ఆరు రాతి రధాలున్నా యి. వీనిని పాండవుల రధాలుగా పిలుస్తారు. పాండవు లతో పాటు వారి సతీమణి ద్రౌపదికి కూడా రధ నిర్మా ణం జరగటం ఇక్కడి విశేషం. పాండవులు ఈ ప్రాం తంలో సంతరించే వారని... అర్జునుడు ఇక్కడ తపస్సు చేసి అనేక శక్తులు సంపాదించాడని చెప్తారు. ఒకే కొండను తొలచి రూపొందించినఈ రధాలపై ఉన్న శిల్పకళా చారుత్యం కనువిందు చేస్తుంది.
ఇక అక్కడి నుండి కూత వేటు దూరం వెళితే అనేక పురాణ గాధల్ని చెక్కిన మూడు మండపాలు మనకి దర్శన మిస్తాయి. ఇవి కృష్ణ మండపం, మహిషాసుర మర్ధిని మండపం, వరహ మండపంగా ప్రసిద్ది చెందాయి.
కృష్ణ మండపంలోకి వెళ్తే...
లోక కళ్యాణం కోసం శ్రీకృష్ణుడు చేసి మాయలు శిల్ప కళా రూపంలో ఇక్కడ దర్శనమిస్తాయి. వెన్న దొంగ తనాలు, గోప బాలురు, నెత్తిన కుండలతో గోపికలు, కన్నయ్య కేరింతల ఆటలు, గోపికలతో చేసిన చిలిపి పనులు, మహాభారత ఘట్టాలు ఇలా కృష్ణ భగవానుని పుట్టుక నుండి చివరి వరకు ప్రతి ముఖ్యఘటాన్ని తిల కిస్తుంటే మనం ద్వార యుగంలోకి వెళ్లిపోతాం. అంత లా ఇక్కడి శిల్పాలు మనల్ని కట్టిపడేస్తాయనటంలో సందేహంలేదు.
మహిషాసురమర్దిని మండపానికి వెళ్తే...
జగత్ రక్షకిగా... సకల చరాలకు మాతృమూర్తిగా కొలు వై ఉన్న పార్వతీదేవి ఆదిపరాశక్తిగా...మహిషాసురుడి ని సంహరించేందుకు దారి తీసిన పరిస్ధితి... భయా నకంగా జరిగిన పోరు... మహిషాసురుడ్ని సంహ రిం చిన తీరు కాసింత భయానక వాతావరణాన్ని ఒలికి స్తూ...కళ్లకు కట్టినట్లు ఇక్కడ కనిపిస్తాయి. ఈ మం డపంలో ఉత్తర గోడలపై ఈ శిల్పకళా చిత్రాలు తమ సోయగాలతో మనల్ని కట్టి పడేస్తుంటే... దక్షిణ గోడ పై పరమ శివుడు నాలుగు చేతులతో స్కందుడి రూపంలో మనల్ని తన దగ్గరకు తీసుకునేలా చిత్రీకరణ జరగగా . పక్కనే ముగ్ధమనోహరంగా నిలబడి ఆశీస్సులందించే పార్వతీదేవి రూపం ఇట్టే ఆకట్టుకుం టుంది.
వరహా వామన మండపం...
ఈ మండపంలోకి అడుగు పెడితే మహా విష్ణువి అపు రూప అవతారాలుగా భావించే వరాహావతారం, వామనావతారంలకు సంబంధించిన ఎన్నో ఘటనలు కళ్ల ముందు సాక్షాత్కరిస్తాయి. ఈ భూమిని రక్షిం చేందుకు స్వామి వరాహ రూపం దాల్చేందుకు దారి తీసిన పరిస్ధితులతో పాటు వామన రూపధారుడైన విష్ణువు అత్యంత దానగుణ సంపన్నుడిగా పేరున్న రాక్షస రాజు బలి చక్రవర్తి దగ్గరకి వచ్చి మూడు అడుగుల నేల అడిగిన తీరు. భూమిని ఆకాశా న్ని రెండడుగులతో ఆక్రమించుకుని తన మూడో అడుగుని బలి నెత్తిన పెట్టి పాతా ళంలోకి నెట్టి సంహరించిన క్రమం చూపరు లను ఆకట్టు కుంటుంది.
చూసేందుకు బోలెడు..
మహాబలిపురం శిల్పకళా అందాలనే కాదు పరిసర ప్రాంతాలలో ఉన్న అనేక ప్రాంతాలు ఆకర్షించేలా ఉంటాయి. వీటిలో చోళమండల ఆర్టిస్ట్ విలేజ్, చెంగల్ పట్టు, కాంచీపట్నం, నిత్యకళ్యాణ పెరుమాళ్ టెంపుల్, తిరుక్కలుకుంద్రం, వందలూరు, దక్షిణ చిత్ర ఇలా దేని కవే ఓ ప్రత్యేకత సంతరించుకున్నాయి. అలాగే చెన్నై నుండి మహాబలిపురానికి వెళ్లే దారిలో విజిపి సంస్ధ నిర్వహిస్తున్న గార్డెన్స్ మిమ్మల్ని కాలు కదపనీయదు. ఇక్కడ చిన్న పిల్లల కోసం ప్రత్యేక ఆటలు, పార్కులు, ఆడుకునేందుకు అనేక రూపాల్లో బొమ్మలు, డిస్నీలాం డ్‌ని మించి ఉన్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు.
పక్షి తీర్ధం :
మహాబలిపురానికి వెళ్లే ఎవరైనా పక్షి తీర్ధాన్ని చూసి రావాల్సిందే... ఇక్కడ ప్రకృతి పులకరింతల నడుమ నిర్మించిన శివాలయం వద్ద ప్రతిరోజూ జరిగే అద్భుత దృశ్యాన్ని చూసేందుకు వేలాది భక్తు లు ఇక్కడి చేరుకుంటారు. ప్రతి రోజూ సూర్యుడు నడినెత్తికి వచ్చే సమయానికి అంటే మిట్టమధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో ఆకాశంలో రెండు క్రౌంచ పక్షులు కనబడగానే అక్కడి ఆలయ పూజారి వాటిని ఆహ్వా నిస్తూ... పళ్లెం వ్రెూగించడం ప్రారంభిస్తాడు. దీంతో అవి గుడినానుకుని ఉన్న విశాలమైన ఆవరణలో వచ్చి వాలుతాయి. అప్పటికే ముందుగా అక్కడికి పెద్ద బింద ెతో పాయసాన్ని ఉంచే కార్యక్రమం పూర్తవుతుంది. ఈ పాయసంలో కొంత భాగాన్ని ఆ పక్షులకు పెడతారు.
అవి ఆనందంగా వాటిని తిని తిరిగి ఎగిరిపోతాయి. ఆపై మిగిలిన దానిని భక్తులకు ప్రసాదంగా ఇస్తారు.
అసలీ పక్షులు అదే సమయానికి ఎందుకు వస్తాయో అర్ధం కాని విషయమే...
దీనిపై స్ధానికులు ఓ కధని చెపðకొస్తారు. పూర్వ కాలం లో ఈ ప్రాంతంలో ఉన్న ఇద్దరు మునులు తమ గురువు కోపానికి గురై ఆతని శాపంతో కౌంచ పక్షులు గా మారిపోతారు. తమకు శాప వివెూచన ఎలా అని కోరగా కలియుగాంతంలో మహాశివుడి దర్శనంతో మీకు నిజరూపం వస్తుందని చెప్తాడు. ఏళ్లు గడుసు ్తన్నా.. నేటికీ ఆ పక్షులు ఇక్కడి శివాలయానికి ప్రతి రోజు మధ్యాహ్నం ఖచ్చితంగా వస్తున్నాయని.. తమ శాప వివవెూచన జరగాల ని కోరుతూ.. పరమశివుని ప్రసాదం పరమానందంతో తింటూ... కోరుకుంటా యని... ఆపై అవి రామేశ్వరం వెళ్లి రాముడు ప్రతిష్టిం చిన రామలింగేశ్వరుడి ఆలయంలో సేద తీరుతుం టాయని చెప్తారు.
ఈ పక్షి తీర్ధం, జరుగుతున్న ఈ వింతలని చూడాలంటే ఖచ్చితంగా మీరు ఉదయాన్నే ఈ ప్రాంతానికి చేరు కోవాల్సి ఉంటుంది. అసలు పక్షితీర్ధం చూడకుండా మహాబలిపురం యాత్ర పూర్తవ్వదనే చెప్పాలి.
ఉత్సవాలూ.. బోలెడు..
మహా బలిపురంలో కొలువైన అనేక దేవా లయాల్లో నిత్యం ఏదో ఓ కార్యక్రమంతో పండగ వాతావరణాన్ని తెస్తూ ఉంటాయనటమే కరక్టు. ఇక్కడ త్రిమూర్తులు కొలువై ఉండటమే కాకుండా అనేక మంది దేవుళ్లు కొలువు దీర టంతో ఉత్సవాలకు కొదువే లేదని చెప్పాలి. ద్రవిడ సాంప్ర దాయంలో నాటి పల్లవరాజులు చేయించిన పద్దతులలో నేటికీ ఇక్క డి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి.
ఎలా వెళ్లాలి
మహాబలిపురం వెళ్లి అక్కడి కళా సంప దని కళ్లారా చూడాలనుకునే వాళ్లు... చెన్నై వెళ్లి అక్కడ నుండి చేరుకునేందుకు బస్సు సౌకర్యం ఉంది. అలాగే మహా బలి పురానికి తమిళనాడు టూరిజం సంస్ధతో పాటు అనేక ప్రయివేటు సంస్ధలు కూడా ప్యాకేజ్ టూర్లు ప్రవేశ పెట్టాయి. ఈ కళా సౌందర్యాన్ని ఆశ్వాదించడానికి ఎలానూ ఒక్కరోజు చాలదు.. అందుకు ఇక్కడ ఉండటా నికి వీలుగా అనేక హౌటళ్లు, లాడ్జింగ్‌లు, గెస్టు హౌస్‌లు ఉన్నాయి. కనుక మరెం దుకు ఆలస్యం మహాబలిపురం బయలు దేరటానికి ఇప్పటి నుండే ప్రయత్నాలు ప్రారం భించడం బెటరేవెూ
కట్టి పడేసే 'డాన్స్ ఫెస్టివల్'
మహాబలిపురంలో ముఖ్యంగా చెపðకోవల్సింది ఏటా జరిగే మహాబలిపురం డాన్స్ ఫెస్టివల్. తమిళనాడు టూరిజం సంస్ధ టూరిస్టులను ఆకర్షించేందుకు ప్రతిఏటా క్రమం తప్పకుండా ఈ ఫెస్టివల్ నిర్వహిస్తూ వస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాలలోని జనపద కళాకారులతో పాటు పేరున్న నృత్య కళాకారులు తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించుకునేందుకు ఈ ఫెస్టివల్ చక్కని వేదికగా భావిస్తారు. ఈ ఫెస్టివల్ ఏటా డిశంబర్, జనవరినెలల్లో శనివారం, ఆదివారంలలో దాదాపు నాలుగు వారాల పాటు జరుగుతాయి. వీటిని చూసేందుకు దేశ విదేశాల నుండి లక్షలాది పర్యాటకులు తరలివస్తారు.

mahayabalipuram kosam kotta vishayalu telusukunnanu andi.. maro vishayam emitante.. nenu kuda mahabalipuram kosam oka blog rasanu andi. okasari miku time unte chudandi..
ReplyDeletehttp://rajachandraphotos.blogspot.com/